దర్శకుడు దుస్తులు తొలగించమన్నాడు.. సల్మాన్ ఆదుకున్నాడు: ప్రియాంక చోప్రా

సినీ కెరీర్లో ఒక్కోసారి హీరోయిన్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తననో డైరక్టర్ దుస్తులు తొలగించమన్నాడు అని సంచలనం రేపింది. అయితే.. తనను సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడని చెప్పుకొచ్చింది. ‘అన్ ఫినిష్డ్’ పేరుతో తీసుకొచ్చిన తన ఆటో బయోగ్రఫీలో ఈ విషయాల్ని వెల్లడించింది. ‘ఓ భారీ ప్రాజెక్టులో భాగమయ్యాను. పాట చిత్రీకరణలో భాగంగా దర్శకుడు నన్ను దుస్తులు తొలగించమన్నాడు. ఇందుకు నేను అంగీకరించలేదు’.

‘ప్రాజెక్టు వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. సినిమా సక్సెస్ కావాలన్నా, ఆడియన్స్ కు రీచ్ కావాలన్నా ఇది తప్పదని డైరక్టర్ చెప్పాడు. అయినా నేను ససేమిరా అన్నాను. అయితే.. నా బాధను తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే స్పందించాడు. నిర్మాతతో మాట్లాడి నాకు ఎటువంటి సమస్యా లేకుండా చేశాడు. ఆ సమయంలో సల్మాన్ ఏం మాట్లడి దర్శక నిర్మాతను ఒప్పించాడో తెలీదు. నాకు ఇబ్బంది లేకుండా షూటింగ్ ముగించారు’ అని చెప్పుకొచ్చింది.