గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్ ప్రమాదానికి గురయ్యారు. శనివారం రాత్రి లాస్ ఏంజెల్స్‌లో ఓ షూటింగ్ లో పాల్గొన్న నిక్ సెట్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనలో నిక్ కు ప్రమాదం తప్పినా చిన్నచిన్న గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేసారు. చికిత్స అనంతరం డాక్టర్లు ఆయన్ను ఆదివారం డిశ్చార్జి చేశారు.
గాయాలైనా యదావిధిగా సోమవారం తాను పాల్గొంటున్న రియాలిటీ షో ‘ది వాయిస్’లో భాగమవుతానని ప్రకటించారు. ప్రస్తుతం నిక్, ప్రియాంక ఇద్దరూ తమ కమిట మెంట్స్ తో బిజీగా ఉంటున్నారు. దీంతో ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఇటీవలే ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫీ ‘అన్‌ఫినిష్డ్’ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో చేరడం.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పుస్తకాలు అమ్ముడుపోవడం విశేషం.