హబ్బీ కోసం ఉపవాసం.. అమెరికా కోడలు ఎట్టెట్టా!!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో భర్త నిక్ జోనాస్ కోసం తన రెండవ కార్వా చౌత్ ఉపవాసం పాటించారు. సాటి భారతీయ మహిళలా.. వివాహిత మాదిరిగానే ఈ సాంప్రదాయాన్ని ఆచరించారు అమెరికా కోడలు పీసీ.సాంప్రదాయ ఎరుపు చీరను ధరించి తన భర్త ధీర్ఘాయుష్కుడిగా సుదీర్ఘ జీవితం గడపాలని.. ఆయన శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండటానికి సిద్ధమైంది. ప్రియాంక తన లవ్లీ-డోవీ కార్వా చౌత్ నుండి కొన్ని ఫోటోల్ని పంచుకోవడానికి సోషల్ మీడియాలోకి వెళ్లింది.

ప్రియాంక ఇటీవల మ్యాట్రిక్స్ 4 షూటింగ్ తర్వాత బెర్లిన్ నుండి తిరిగి వచ్చాక కూడా అంత స్ట్రెస్ లోనూ నిక్ కోసం కార్వా చౌత్ ఉపవాసాన్ని అస్సలు మర్చిపోలేదు.

తన ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎర్రబారిన ఫోటోల సమూహం ఎంతో సంబరంగా కనిపిస్తోంది. కార్వా చౌత్ వేడుకల నుండి అందమైన ఫోటోలను పీసీ అభిమానుల కోసం పంచుకుంది. మొదటి ఫోటోలో పీసీ తన అద్భుతమైన మంగళసూత్రం.. సింధూర్ ని ఆవిష్కరించగా.. చెవిరింగులతో అందంగా .. సొగసైన ఎరుపు చీరను ధరించి కనిపించింది. ఆమె ఫోటో కోసం హాయిగా నవ్వడంతో ఆమె పూజాకి అవసరమైన థాలి పట్టుకొని ఉంది. పండుగ సందర్భంగా నిక్ జోనాస్ కోసం ప్రార్థన చేయడానికి ఆమె సిద్ధమవుతున్నప్పుడు గ్లోబల్ స్టార్ పీసీ ముఖం పై మెరుపును గమనించవచ్చు. మరొక ఫోటోలో ప్రియాంక తన భర్త నిక్ మీద ప్రేమను చూపిస్తున్న వైనం ఆకర్షించింది. ఇద్దరూ ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కనిపిస్తుంటే.. కళ్ళు తిప్పుకోవడం కష్టమే.

సంబరాలు జరుపుకునే ప్రతి ఒక్కరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు… ఐ లవ్ యు నిక్ జోనాస్ అంటూ పీసీ సంబరంగా వ్యాఖ్యానం జోడించాశారు. నిక్ కూడా అవే ఫోటోలను పంచుకుని.. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక చాలామంది భారతీయులు స్వదేశాన్ని వీడి అమెరికాలో అడుగుపెట్టినా ఇక్కడ సాంప్రదాయాల్ని విడిచిపెట్టేందుకు ఎంతమాత్రం ఆసక్తిగా ఉండరు. ప్రతిదీ మనదైన సాంప్రదాయాన్ని బతికించుకునే ప్రయత్నం చేయడం ప్రశంసించదగినది. పీసీ కూడా భారతీయ సాంప్రదాయాలకు విలువను అపాదించి విదేశీ గడ్డపై గౌరవం పెంచుతున్నారు.

ప్రస్తుతం అమెరికా ఎలక్షన్స్ 2020 ఫలితాలను చూడటానికి తన కుటుంబంతో ప్రియాంక చోప్రా అక్కడే గడుపుతున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. కెరీర్ సంగతి చూస్తే… ప్రియాంక ఇటీవల కీను రీవ్స్ తో కలిసి మ్యాట్రిక్స్ 4 షూటింగులో పాల్గొంది. ఆమె ఇప్పుడు ది వైట్ టైగర్ లో రాజ్ కుమార్ రావుతో కలిసి కనిపిస్తుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇది కాకుండా రిచర్డ్ మాడెన్ తో ప్రియాంకకు సిటాడెల్ అనే మూవీ కూడా ఉంది.