బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక నెగిటివ్ టాక్ అయితే గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ సినిమాను బాయికాట్ చేయాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
ఈ విషయం అమీర్ ఖాన్ దాకా వెళ్లడంతో ఇదివరకే కొన్నిసార్లు తనదైన శైలిలో ఒక వివరణ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆ నెగటివ్ ట్యాగ్ ఈ సినిమా పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రోజురోజుకు సోషల్ మీడియాలో బాయికాట్ లాల్ సింగ్ చడ్డా ట్యాగ్ అయితే ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతోంది.
చిత్ర యూనిట్ సభ్యులు ఒకవైపు ప్రమోషన్ చేస్తూ ఉంటే ఆ ఫోటోలో కిందనే ఈ నెగటివ్ ట్యాగ్ తో మరికొందరు హడావుడి చేస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ దేశంలో రక్షణ కరువైంది అనే విదేశాల్లోకి వెళ్లి పోవాలని ఉంది అని చేసిన కామెంట్స్ ఓ వర్గం వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
అంతేకాకుండా కరీనాకపూర్ కూడా గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఇక సినిమా రైటర్ కూడా అదే తరహా వివాదంతో ఆ టాపిక్ గా మారిపోయాడు.
లాల్ సింగ్ చడ్డా సినిమాకు అన్ని వైపుల నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి వరకు ఏదో సోసో గా కొనసాగిన #BoycottLaalSinghChaddha ఇప్పుడు మరింత తీవ్రంగా మారిపోయింది.
చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం అయితే చేయడానికి ఏమీ లేదు. మరో కొన్ని గంటల్లో ప్రీమియర్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఇక సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చినట్లు కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.