PSPK – హరీష్ శంకర్.. ఏదో తేడాగా ఉందేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలం పాటు ఎదురు చూస్తున్నాడు. అయితే వీరిద్దరికీ సరైన సమయం దొరకడం లేదు. ఇక టైం దొరికినప్పుడు సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు. మొత్తానికి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్లో ఒకటి చేయడానికి సిద్ధమయింది. అయితే మొదట వీరు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలని అనుకున్నారు.

ఫైనల్ స్క్రిప్ సిద్దమైన తర్వాత మళ్లీ ఎందుకో ఆ స్క్రిప్ట్ క్యాన్సిల్ అయింది. పవన్ కళ్యాణ్ ఇతర దర్శకులతో సినిమాలను ఓకే చేస్తున్నంత వేగంగా హరిష్ శంకర్ సినిమాను మాత్రం ఇంకా మొదలు పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మాస్ కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న హరీష్ శంకర్ ను ఎందుకు ఇంత వెయిటింగ్ లిస్టులో పెడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.

అయితే కొద్దిసేపటి క్రితమే దర్శకుడు హరీష్ శంకర్ బిగ్ ఎక్సైట్మెంట్ వేగంగా రాబోతోంది అని వీలైనంత త్వరగా అప్డేట్ ఇస్తాను అన్నట్లుగా ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ఎకౌంట్స్ ను కూడా ట్యాగ్ చేయడంతో ఫాన్స్ అయితే మొత్తానికి అఫీషియల్ అప్డేట్ రాబోతున్నట్లుగా కలలు కుంటున్నారు. అయితే ఇదివరకే మూడు నాలుగు సార్లు హరిష్ శంకర్ ఇదే తరహాలో ట్వీట్ అయితే వేశాడు.

అయితే ప్రస్తుతం మరొక టాక్ ప్రకారం వీరిద్దరూ తేరి రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అట్లీ విజయ్ కాంబినేషన్లో వచ్చిన తేరి సినిమా ఇప్పటికే పోలీసోడు టైటిల్ తో వచ్చింది. తెలుగులో స్టార్ మా లో నెలకు ఒకసారి టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది.

అలాంటి సినిమాను ఎందుకు రీమేక్ చేస్తున్నారు అని అభిమానులలో మరొక కొత్త టెన్షన్ మొదలైంది. అసలే రీమేక్ చేయకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నాడు అనే టాక్ వచ్చిన కొద్దిసేపట్లోనే మళ్లీ ఈ తరహా వార్తలు వైరల్ అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.