కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెంది కోట్లాది అభిమానుల్ని శోక సంద్రంలో ముంచేశారు. ఆయన మరణించారంటే ఇప్పటికే చాలా మంది ఆయన ఫ్యాన్స్ నమ్మడం లేదు. ఆయన బౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాల మాతోనే కలకాలం వుంటాయని మరి కొంత మంది సరిపెట్టుకుంటున్నారు. ఈ రోజు దివంగత స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చి అందిరిని షాక్ కు గురిచేస్తోంది. అప్పూ చనిపోయిన విషయం ఆయన మేనత్త నాగమ్మకు ఇప్పటికీ తెలియదట.
ఆమెకు తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారట. పునీత్ గురించి అడిగిన ప్రతీ సారి తనకు సంబంధించిన షూటింగ్ వీడియోలు చూపిస్తూ షూటింగ్ లో వున్నాడని త్వరలోనే తిరిగి వస్తాడని చెబుతున్నారట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ పునీత్ జ్ఞపాకాల్ని సోసల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్న ఫ్యాన్స్ తాజా విషయం తెలిసి షాక్ అవుతున్నారట. పునీత్ మేనత్త నాగమ్మకు 90 ఏళ్లు. రాజ్ కుమార్ ఫ్యామిలీలో నాగమ్మనే పెద్ద. ఆమెకు పునీత్ అంటే చాలా ఇష్టమట.
పునీత్ ఎక్కువగా ఆమెని గాజనూర్ లోని పూర్వికుల ఇంటిలో నాగమ్మతో గడిపేవారట. గత కొన్ని రోజులుగా పునీత్ రాజ్ కుమార్ గురించి కుటుంబ సభ్యలుని అడుగుతున్నా వారు మాత్రం అసలు విషయం దాచిపెట్టి పునీత్ షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లాడని త్వరలోనే తిరిగి వస్తాడని చెబుతున్నారట. గంతలో శివరాజ్ కుమార్ కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనని హాస్పిటల్ లో చేర్పించారు. ఆ విషయం తెలిసి నాగమ్మ తీవ్ర అస్వస్థకు గురయ్యారట.
ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు నాగమ్మ వద్ద పునీత్ మరణ వార్తని దాచేస్తున్నారని చెబుతున్నారు. ఆ కారణంగానే ఆమె ఇంట్లో వున్న సునీత్ ఫొటోకు కుటుంబ సభ్యులు దండలు వేయలేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వైరల్ గా మారాయి. పునీత్ లేరని ఎవరన్నారని ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు మన మధ్యే వున్నాయని ఆయనకు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వబోతున్నామ వెల్లడించారు.
త్వరలోనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవార్డుని అందజేస్తామని ఆ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పునీత్ లేరని బాధగా వున్నా ఆయన అభిమానులు సమాజ సేవ చేస్తున్న తీరుని చూస్తే చాలా సంతోషంగా వుందన్నారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్. ‘జేమ్స్’ విడుదలవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ పునీత్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం బాధగా వుందని విచారం వ్యక్తం చేశారు.
పునీత్ లేకుండా జరుగుతున్న తొలి జయంతి ఇదని అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతందని.. ఆ స్థాయిలో ఆయన సమాజ సేవ చేశారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ భావోద్వేగానికి లోనయ్యారు.