పుష్ప 2 బన్నీ ఫ్యాన్స్‌ కి బ్యాడ్‌ న్యూస్‌, కాని..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కి గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా రెండవ భాగం షూటింగ్‌ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది. కానీ స్క్రిప్టు విషయం లో విభేదాలు లేదా మరేదో కారణం వల్ల షూటింగ్ ప్రారంభించ లేదు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే జూన్ నుండి పుష్ప 2 షూటింగ్ మొదలు కాబోతున్న ట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 చిత్రీకరణ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ ఏడాది డిసెంబర్ లోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మొన్నటి వరకు ప్రతి ఒక్కరు భావించారు. కానీ తాజాగా మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2023 వరకు పుష్ప 2 సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండక పోవచ్చు. విడుదల కూడా ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. ఇది ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ కానీ ఆలస్యమైన కొద్దీ స్క్రిప్టు మరింత పదును పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా పుష్ప 2 మరింత విజయం సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.