పుష్ప రెండు భాగాలుగా.. పక్కానా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పుష్ప. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే కరోనా కారణంగా పుష్ప షూటింగ్ ను బ్రేకులు పడ్డాయి. అల్లు అర్జున్ కు కరోనా సోకింది. ఆయన ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

పుష్ప టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ ను దాటేసింది ఈ టీజర్. అలాగే పుష్ప చిత్రం గురించి అందుతోన్న మరో సమాచారం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. మొదటి భాగాన్ని ఆగస్ట్ 13న విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా అది సాధ్యపడదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

కొన్ని నెలల గ్యాప్ లోనే పుష్ప రెండు భాగాలను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతోంది.