మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా పుష్ప టీజర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్యాన్ ఇండియన్ మూవీ పుష్ప షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నవంబర్ రెండో వారానికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన. ఇప్పటికే పుష్ప ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. మొత్తంగా మూడు పాటలు ఈ సినిమా నుండి విడుదలయ్యాయి. ఈ మూడింటికీ కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది.

ఇక ఈసారి పుష్ప నుండి టీజర్ విడుదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప గ్లిమ్స్ మిలియన్స్ వ్యూస్ తో రచ్చ రచ్చ చేసింది. అలాగే పుష్ప టీజర్ ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్ రేపు వస్తుంది.

టీజర్ విషయానికొస్తే పుష్ప కట్ ను మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉండాలని ప్లాన్ చేసాడట దర్శకుడు. పుష్ప మాస్ ప్రేక్షకులకు ఒక ట్రీట్ లా ఉంటుందిట.