‘రాధేశ్యామ్‌’ హైబ్రిడ్ రిలీజ్ కు ప్రయత్నాలు

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్‌ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఒకటి రెండు వారాల షూటింగ్‌ మినహా పూర్తి అయ్యింది. ఈ సినిమా ను జులై లో విడుదల చేసేందుకు అధికారికంగా తేదీని ప్రకటించారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోతుంది. కనుక విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలోనే జీ సంస్థ వారు రాధేశ్యామ్‌ సినిమాను హైబ్రిడ్‌ రిలీజ్ కు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాధే సినిమా ను ఇటీవలే జీ ప్లెక్స్‌ ద్వారా పే పర్‌ రిలీజ్ ద్వారా విడుదల చేశారు. వంద కోట్లకు పైగా మొదటి రోజే వసూళ్లు సాధించిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించింది. రాధేశ్యామ్‌ సినిమా ను కూడా జీ ప్లెక్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. థియేటర్‌ రిలీజ్‌ తో పాటు ఒకేసారి పే పర్‌ వ్యూ ద్వారా ఓటీటీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాని ప్రభాస్‌ మాత్రం అందుకు ఒప్పుకుంటాడా అంటే అనుమానమే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల వరకు పరిస్థితులు సర్దుమనిగితే పర్వాలేదు లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.