రఘువీరారెడ్డి మళ్లీ తెరపైకి రానున్నాడా?

తెలుగు రాష్ట్రాల్లో కొంత రాజకీయ జ్ఞానం ఉన్న వారికి కూడా రఘువీరారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం రేసులో కూడా నిలిచిన ఆయన చాలా సందర్బాల్లో కాంగ్రెస్ అధినాయకత్వంకు అత్యంత సన్నిహితుడిగా పేరు దక్కించుకున్నాడు. రాష్ట్ర మంత్రిగా పార్టీ అత్యున్నత పదవులు అలంకరించిన ఆయన ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓడినప్పటి నుండి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. చిన్న టీవీఎస్ పై ఊర్లో తిరుగుతూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు.

రఘువీరారెడ్డి కాంగ్రెస్‌ లో మళ్లీ క్రియాశీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అంటున్నారు. పార్టీ వ్యవహారాల గురించి చర్చించేందుకు గాను రాహుల్‌ గాంధీ మరియు సోనియా గాంధీలు స్వయంగా రఘువీరాను పిలిచారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నుండి కూడా ఈయనకు పిలుపు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగు దేశం పార్టీలో రఘువీరా మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.