ఎంపీ రఘురామ కృష్ణం రాజు ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు మరియు పోలీసులు సికింద్రాబాద్ తీసుకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో రఘురామ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రిని చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉన్న మీడియా తో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. తనను కొట్టారని తన కాళ్లకు గాయాలు అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
మీడియాకు తన కాలి గాయాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే పోలీసులు ఆయన్ను హడావుడిగా ఆసుపత్రి లోనికి తీసుకు వెళ్లారు. ఎస్కార్ట్ వాహనంలో రఘురామ కృష్ణం రాజును ఆసుపత్రి వరకు తరలించి అక్కడ నుండి లోనికి ఆంబులెన్స్ లో తీసుకు వెళ్లారు. ఆ సమయంలో ఎంపీ మాట్లాడుతూ తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని పేర్కొన్నాడు. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.