సీఎం జగన్‌ కు రఘురామ లేఖ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి మరోసారి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సీపీఎస్ విధానం రద్దు విషయమై ఎన్నికల సమయంలో జగన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. తాను అధికారంలోకి వస్తే కేవలం 7 రోజుల్లోనే సీపీఎస్ విధానంను రద్దు చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఇప్పటి వరకు సీఎం సీపీఎస్‌ విధానం ను రద్దు చేసే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రఘురామ ఆరోపించాడు.

ఉద్యోగుల మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పుడు వారిని మరిచాడు అంటూ రఘురామ పేర్కొన్నాడు. ఇప్పటికి అయినా వెంటనే ఉద్యోగుల సీపీఎస్ విధానంను రద్దు చేయాలని రఘురామ డిమాండ్ చేశాడు. సీఎం జగన్ తన డిమాండ్ ను వెంటనే నెరవేర్చకుంటే ఉద్యోగ సంఘాలతో కలిసి ఆందోళన చేయబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు.