సీఎం జగన్‌ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్‌

వైకాపాకు చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజు స్వపక్షంలో విపక్షం మాదిరిగా మారిపోయాడు. మొదటి నుండి ఈయన వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు సీఎం నిర్ణయాలను తప్పుబడుతూ వస్తున్నాడు. ఈ విషయమై ఆయన తీరును వైకాపా నాయకులు పదే పదే తప్పుబడుతున్నారు. ఇక ఆయన్ను సొంత నియోజక వర్గం అయిన నరసాపురం పర్యటనకు ఆయన్ను వెళ్లనివ్వడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నరసాపురం నియోజక వర్గంలో పర్యటించకుండా ఎంపీ ను టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారావు మరియు మంత్రి రంగనాథరావులు అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపించాడు.

తన పర్యటన చివరి నిమిషంలో వాయిదా వేసుకున్న రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయమై సీఎం జగన్‌ తో మాట్లాడేందుకు ఫోన్‌ కూడా చేశాడట. కాని అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ఈ విషయాన్ని పార్లమెంటు ముందుకు తీసుకు వెళ్తానంటూ హెచ్చరించాడు. తనను గెలిపించిన ప్రజల వద్దకు వెళ్లకుండా తన నియోజక వర్గంకు వెళ్లకుండా అడ్డుకోవడంను పార్లమెంట్‌ సీరియస్ గా పరిగనిస్తుంది. అది రాష్ట్రంకు సీఎం కు అస్సలు మంచిది కాదంటూ హెచ్చరించాడు. తర్వాత పార్లమెంటు సమావేశాల వరకు తన పర్యటనకు అడ్డు తప్పుకోవాలని ఆయన పేర్కొన్నాడు.