వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరోసారి సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమపై జగన్ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ద చూపిస్తుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు. టికెట్లను ఆన్ లైన్ లో ప్రభుత్వం స్వయంగా అమ్మేందుకు సిద్దం అవుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. సినిమా పరిశ్రమ అనేది చాలా చిన్న పరిశ్రమ. దానిపై ఎందుకు ఇంత శ్రద్దను ప్రభుత్వం పెడుతుందో అర్థం కావడం లేదు అన్నాడు. సినిమా పరిశ్రమ వారు అడిగినా కూడా ప్రభుత్వం ఆ విషయాలను పట్టించుకోకుండా ఉండాలన్నాడు.
సినిమా పరిశ్రమ వారు వారి థియేటర్లలో బాత్ రూమ్స్ ను క్లీన్ చేయడం కోసం వాలంటీర్లను కేటాయించండి అంటూ కోరితే వారిని అందుకు ఉపయోగిస్తారా… వారు వాలంటీర్లకు ఇచ్చే జీతం ఇస్తామంటే ఆ పని చేస్తారా అంటూ ప్రశ్నించాడు. పవన్ పై ఉన్న కోపంతో మొత్తం ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టేలే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ రఘురామ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలను రఘురామ సమర్థించాడు.