వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రెడ్డి కులంపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ అన్నట్టు గిల్లితే గిల్లుంచుకోవాలా? వాయిస్ వినిపించకూడదా? ఆపండ్రా… ఈ ఎదవ చెత్త’’ అని అన్నారు.
రెడ్డి కులంపై వ్యాఖ్యానిస్తూ.. ‘మీకు మీరే అనేసుకుంటే సరిపోతుందా? నీ బాబు, నీ అమ్మ కులం సర్టిఫికేట్లలో కాపు అని ఉంటే రెడ్డి ఎలా అవుతారు? ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చుకుని మేము రెడ్లు.. రెడ్లు అనుకుంటే అయిపోతుందా? నీ తండ్రి కులం, తల్లి కులం కానిది నీకెలా వచ్చిందిరా రెడ్డి? అని మండిపడ్డారు. వైఎస్ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో కాపు ఉంటే జగన్ ‘రెడ్డి’ ఎలా అవుతాడురా.. కాపే అవుతాడు’ అని అన్నారు. తనను విమర్శిస్తుంటే కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానని ఆయన అన్నారు.