చేసింది తప్పు కాకపోయినా.. సీనియర్లే నన్ను టార్గెట్ చేశారు: రాహుల్ గాంధీ

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలో ఎన్నికలు జరగాలని తాను పట్టుబట్టడంతోనే పార్టీ సీనియర్ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఓ యూనివర్శిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటివల జీ-23 నేతలు రాహుల్ గాంధీపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ స్పందించారు. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని సూచించడమే తప్పా? అని ప్రశ్నించారు. అందుకే నేను టార్గెట్ అయ్యా.. సొంత పార్టీ వ్యక్తులే నన్ను టార్గెట్ చేశారని అన్నారు. ఈ ప్రశ్నలు ఇతర పార్టీల వ్యక్తులు వేసుకోకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

సైద్ధాంతికంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడిపడానికి ఇది ఎంతో ఉపయోగం అన్నారు, వరుసగా ఎన్నికల్లో ఓటమిపై కూడా రాహుల్ స్పందించారు. అన్ని రంగాల్లో గెలుపోటములు ఉంటాయి. వీటిని ఎదుర్కొని పార్టీని పకడ్బందీగా నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నావారంరినీ ఒక్క తాటిపై నడిపించాలి. 2014 నుంచీ గెలవాలనే ప్రయత్నంలోనే ఉన్నామని అన్నారు