బిగ్ బాస్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ – నటి పునర్నవి మధ్య రిలేషన్ నడిచిన విషయం తెల్సిందే. వీరిద్దరి క్లోజ్ నెస్ చూసి అందరూ వీరు ప్రేమికులు అని భ్రమపడ్డారు. రాహుల్ బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వడానికి ఈ రిలేషన్ కూడా సహాయం చేసిందనే చెప్పొచ్చు. వరుణ్-వితిక జోడి, రాహుల్-పునర్నవి జోడి.. ఈ నలుగురు ఒక బ్యాచ్ గా బిగ్ బాస్ లో బానే హల్చల్ చేసారు. బయటకొచ్చాక కూడా వీరి హడావిడి ఏ మాత్రం తగ్గలేదు. కలిసి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మీడియాకు కూడా వీరిద్దరూ కలిసే ఉన్నట్లు, వీరి మధ్య ఏదో ఉన్నట్లు హింట్ ఇచ్చేలాగా ప్రవర్తించారు. బయటొచ్చాక వీరిద్దరూ డేటింగ్ చేసారని, త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందని అన్నారు.
ఇదంతా జరిగాక ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ వీరి మధ్య ఏం లేదన్నట్లు మాట్లాడాడు. స్క్రీన్ మీద కనిపించేవన్నీ నిజాలు కావు. బిగ్ బాస్ ముగిసి ఏడాది కావొస్తోంది. ప్రతీ ఒక్కరికీ వారి వారి జీవితాలు ఉంటాయి. అందరూ దాన్నుండి బయటకు వచ్చేసారు. మీరు కూడా రండి అని రాహుల్ కాస్త ఘాటుగానే స్పందించాడు. వీరిద్దరూ విడిపోయారు కాబట్టే రాహుల్ ఇలా మాట్లాడాడు అంటున్నారు.
మరోవైపు రాహుల్ ఇప్పుడు అషు రెడ్డితో డేటింగ్ చేస్తున్నాడు కాబట్టే పున్నూకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిలో ఏది నిజమో మాత్రం బయటకు రాలేదు.