మరో షాక్ ను ఎదుర్కొన్న రాజ్ కుంద్రా

పోర్న్ వీడియోల వ్యాపారం చేస్తున్నాడన్న కారణంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడు రాజ్ కుంద్రా. నటుడు మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సత్యయుగ్ అనే కంపెనీకి చైర్మన్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో బంగారంపై ఆదాయం అందిస్తామంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మి నటుడు సచిన్ జోషి కిలో బంగారాన్ని కంపెనీలో ఇన్వెస్ట్ చేసాడు.

అయితే రాజ్ కుంద్రా కంపెనీ ఐదేళ్లు పూర్తైన తర్వాత కూడా సచిన్ కు బంగారం తిరిగి ఇవ్వకుండా అడ్డాగోలుగా వ్యవహరించింది. దీనిపై కోర్టుకు వెళ్లిన సచిన్ కు ఊరట లభించింది. రాజ్ కుంద్రా కంపెనీ సచిన్ కు రూ. 25 లక్షల 50 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

దీనిపై సచిన్ జోషి స్పందిస్తూ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని ట్వీట్ చేసాడు.