చిరు చిన్నబుచ్చుకునేలా రాజమౌళి అలా అనేశారు!

ఒకటే వేదిక. కానీ ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు పొగిడేసుకున్న సందర్భమది. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి! అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించిన తీరు అమోఘం. జక్కన్న జీవితంలో అది మరపురాని క్షణం అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇదే ఆచార్య ప్రీరిలీజ్ వేదికపై రాజమౌళి కూడా మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఏమని వ్యాఖ్యానించారు? అంటే..

తన హీరో చరణ్ బెటర్ అంటూనే మెగాస్టార్ చిరంజీవి కి అభిమానిగా ఆయన ఎప్పుడూ శిఖరం అంటూ రాజమౌళి చిరును పొగిడేసారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ.. నాకు ఆయనలోని పోటీతత్వం నచ్చింది. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా నేనే డామినేట్ చేయాలని చిరంజీవి కోరుకుంటారు. ఆ లక్షణం చూడటానికి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ఒక అభిమానిగా చిరంజీవి గారే బాగా చేసారని అనిపిస్తారు. కానీ ఒక డైరెక్టర్ గా నాకు నా హీరోనే మీకంటే బెటర్ సర్…! అని జక్కన్న అన్నారు. దానికి చిరు స్మైల్ సమాధానంగా నిలిచింది వేదికపై.

చరణ్ పైనా జక్కన్న ప్రశంసలు కురిపించారు. మగధీర సమయంలో చిరంజీవిగారు కథ విన్నారు. అప్పుడు రామ్ చరణ్ విషయాలన్నీ దగ్గరుండి చిరంజీవిగారే చూసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ చరణ్ కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. చరణ్ నువ్వు ఇలా చెయ్ అలా చెయొద్దు అని చెప్పరు.

ఈ సినిమాలో నీ నటన బాగుంది.. నీ యాక్టింగ్ బాలేదని చెప్పరు. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్ తన సొంతంగా నేర్చుకున్నాడు. తను తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాని నుంచి ప్రతీది నేర్చుకుని తనకు తానుగా ఎదిగాడు. మెగాస్టార్ కొడుకైనా హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు. ఇలానే ఉండు చరణ్ నువ్వింకా ఎదుగుతావు.. అంటూ జక్కన్న బ్లెస్ చేశారు.