మిలియన్ మార్క్‌ కోసం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ విశ్వ ప్రయత్నాలు

ఈమద్య కాలంలో స్టార్ హీరోల అభిమానులు సోషల్‌ మీడియా రికార్డులు యూట్యూబ్ రికార్డుల మీద పడ్డారు. యూట్యూబ్‌ లో మొదట అత్యధిక వ్యూస్ ను రికార్డుగా లెక్కించేవారు. ఇప్పుడు అత్యధిక లైక్స్ మరియు కామెంట్స్ ను కూడా రికార్డులుగా చెబుతున్నారు. సౌత్‌ లో మాస్టర్‌ టీజర్‌ కు అత్యధిక యూట్యూబ్‌ కామెంట్స్‌ వచ్చాయి. 9.5 లక్షల కామెంట్స్ ను మాస్టర్‌ టీజర్ దక్కించుకుంది. తర్వాత స్థానంలో రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో కామెంట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 8 లక్షల కామెంట్స్ ను ఆ వీడియో దక్కించుకుంది.

తెలుగు సినిమాల వీడియోల్లో అత్యధిక కామెంట్స్ సాధించిన వీడియోగా ఇప్పటికే యూట్యూబ్‌ లో రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులు సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా అన్నట్లుగా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. మిలియన్‌ మార్క్‌ ను క్రాస్‌ చేయడంతో పాటు మాస్టర్‌ టీజర్‌ కామెంట్స్ ను బీట్‌ చేసి నెం.1 గా నిలపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వీడియోకు అన్ని లక్షల కామెంట్స్ అంటేనే చాలా అరుదైన విషయం. అలాంటిది ఏకంగా మిలియన్‌ కామెంట్స్‌ అంటే ఇక మరో లెవల్‌ అన్నట్లే. మరి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మిలియన్‌ మార్క్‌ చేరుకోలేస్తారా చూడాలి.