రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఫాన్స్ కి బంపర్ న్యూస్.!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ తారలతో పాటు హాలీవుడ్ తారలు కూడా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ఇటీవలే అలియా భట్ కూడా పాల్గొని తన ఫస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేసింది.

ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు రకాల వార్తలు, పలు డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి అటు తారక అభిమానుల్ని, ఇటు రామ్ చరణ్ అభిమానులను ఖుషీ చేసే ఓ న్యూస్ వచ్చింది. అదే ఆర్ఆర్ఆర్ టీజర్ అప్డేట్.. స్వాతంత్ర్యం టైమ్ బాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని జనవరి 26 న రిపబ్లిక్ డి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దానికి సంబందించిన వర్క్స్ కూడా స్పీడ్ గా జరుగుతున్నాయని సమాచారం.

ఇటీవలే హైదరాబాద్, లింగంపల్లి లో వేసిన ఓ సెట్లో రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్ మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ బ్లాక్ థియేటర్స్ లో ప్రేక్షకులందరికీ పిచ్చెక్కిపోయేలా ఉంటుందని సమాచారం.