సీనియర్ నటుడి కొడుకు అరెస్ట్‌

ఆది, దిల్‌, ఒక్కడు, ఖుషి సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన రాజన్ పి దేవ్ గుర్తు ఉన్నాడు కదా ఆయన తనయుడు ఉన్ని రాజన్‌ కూడా నటుడే. మలయాళంలో పలు సినిమాల్లో నటించాడు. ఆయన రెండేళ్ల క్రితం ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. ప్రైవేట్ స్కూల్‌ లో ప్రియాంక టీచర్ గా వ్యవహరించేది. ఉన్ని రాజన్ మరియు ప్రియాంకల మద్య రెగ్యులర్ గా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ఇటీవలే ప్రియాంక తన పుట్టింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

ప్రియాంక మృతికి ఉన్ని రాజన్‌ కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పెళ్లి అయినప్పటి నుండి కూడా ఉన్ని రాజన్ అదనపు కట్నం కోసం వేదించాడు. ఆయన వేదింపుల వల్లే ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్ని రాజన్ ను అరెస్ట్‌ చేశారు. ఉన్ని రాజన్‌ తండ్రి రాజన్‌ పీ దేవ్‌ కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుండి జల్సాలకు అలవాటు పడి చెడిపోయాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.