ఎన్నికల సమయంలో అసలు ఇండియాలోనే ఉండటం లేదట

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మరి కొన్ని నెలల్లో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పడం ఖాయం అంటూ అభిమానులు రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలో అనారోగ్య కారణాలతో పార్టీని పెట్టడం నా వల్ల కాదు అంటూ రజినీకాంత్‌ చేతులు ఎత్తేశాడు. దాంతో ఆయన రాజకీయ అరంగేట్రం చేయకుండానే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకున్నా కూడా ఆయన ఏదో ఒక పార్టీకి మద్దతు చెప్పే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల సమయంలో రజినీకాంత్‌ తమిళనాడులో కాదు కదా కనీసం ఇండియాలో కూడా ఉండటం లేదట.

ఈ నెల నాల్గవ వారంలో అన్నాత్తే షూటింగ్ ను రజినీకాంత్‌ పునః ప్రారంభించబోతున్నాడు. ఫిబ్రవరి నెలలో సినిమాను పూర్తి చేయబోతున్నాడు. మార్చి మొదటి వారంలోనే అమెరికాకు రజినీకాంత్‌ వెళ్లబోతున్నాడు. అక్కడ పలు అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడు అంటూ వార్తలు వస్తున్నాడు. దాదాపు మూడు నెలల పాటు అక్కడే ఉంటాడని అంటున్నారు. అంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంకు రజినీకాంత్‌ అమెరికాలో సేద తీరుతూ ఉంటాడు అన్నమాట.