రజినీకాంత్‌ హెల్త్‌ బులిటెన్‌: పూర్తిగా మెరుగుపడ్డ ఆరోగ్యం

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హై బీపీతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. ఆయన అన్నాత్తే చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో రజినీకాంత్ అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగించాయి. కేవలం హై బీపీ వల్లే రజినీకాంత్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనుక కరోనా లక్షణాలు ఏమీ లేవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని వెళ్లడించారు. ఇక రజినీకాంత్‌ హెల్త్‌ అప్ డేట్‌ను అపోలో ఆసుపత్రి వర్గాల వారు రెగ్యులర్‌ గా ఇస్తూనే ఉన్నారు.

రజినీకాంత్‌ ఆరోగ్యం విషయంలో నేడు మరో హెల్త్‌ బులిటెన్‌ ను అపోలో వారు వెళ్లడించారు. రజినీకాంత్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడింది. ఆయన్ను ఈరోజు సాయంత్రంకు డిశ్చార్జ్‌ చేసే విషయమై చర్చిస్తున్నామన్నారు. ప్రముఖ వైధ్య బృందం ఆయన పూర్తి ఆరోగ్య విషయమై విశ్లేషిస్తున్నాం. అన్ని రిపోర్ట్‌ లు కూడా బాగానే ఉన్నాయి. కనుక రజినీకాంత్‌ అనారోగ్య విషయమై ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటూ వైధ్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.