అపోలో నుంచి రజినీకాంత్ డిశ్చార్జి.. చార్టెడ్ ఫ్లైట్ లో చెన్నైకు..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కొద్ది రోజుల క్రితం రజినీకాంత్ కు హై బీపీ రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చెన్నై నుంచి ఆయన వైద్య బృందం కూడా వచ్చింది. ఆయనకు క్రమం తప్పకుండా రోజూ బీపీ పరీక్షలు నిర్వహించారు. అన్ని పరిక్షల్లో నార్మల్ రిపోర్ట్ రావడంతో ఈరోజు డిశ్చార్జి చేశారు.

దీంతో రజినీకాంత్ చెన్నైకు పయనమయ్యారు. ఆసుపత్రి నుంచి బేగంపేట విమానాశ్రయంకు బయలు దేరారు. అక్కడి నుంచి చార్టెడ్ ఫ్లైట్ ద్వారా చెన్నై వెళ్లనున్నారు. అయితే.. వారం రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ప్రతిరోజు విధిగా బీపీ పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. పది రోజుల క్రితం ‘అన్నాతే’ సినిమా షూటింగ్ కు హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ సమయంలో 8 మందికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ఈనెల 31న రాజకీయ పార్టీ వివరాలు వెల్లడిస్తానన్న రజినీ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.