సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వగానే అందరూ కలవరపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీశారు. వందల సంఖ్యలో హాస్పిటల్ వద్ద గుమిగూడారు. అయితే రజినీకాంత్ క్రమంగా కోలుకున్నారు. రెండు రోజుల్లో అపోలో హాస్పిటల్స్ నుండి ఆయనకు వివిధ టెస్టులు చేసిన తర్వాత నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేసారు.
డిశ్చార్జ్ అయిన వెంటనే రజినీకాంత్ చెన్నైకు పయనమయ్యారు. నిన్న రాత్రికే ఆయన చెన్నై చేరుకోవడం విశేషం. ఆయన భార్య లత రజినికు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ కు వైద్యులు పది రోజులు బెడ్ రెస్ట్ ను సూచించినట్లు తెలుస్తోంది. ఏ రకమైన పనులు చేయొద్దు అంటూ వైద్యులు సూచించారట.
మొత్తానికి రజినీకాంత్ కోలుకోవడంతో కోట్లాది మంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ వీలైనంత త్వరలో రజినీ ఎప్పట్లానే చలాకీగా షూటింగ్స్ లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం రజినీ అన్నాతై సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.