ఎక్స్ క్లూజివ్: ఇండియాలోనే మొదటి సారిగా కనీ వినీ ఎరుగని రీతిలో రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్

అటు ఫ్యామిలీ పరంగా, ఇటు సినీ వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని పుత్రోత్సాహాన్ని ఇస్తున్న హీరో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరు వారసుడిగా పరిచయమై నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఇండియా వైడ్ చిరంజీవి తర్వాత మరో అరుదైన రికార్డ్ ని నెలకొల్పనున్నారు.

అదేమిటంటే ఇప్పటి వరకూ ఇండియాలో, దాదాపు 25 ఏళ్లుగా ఒక్క చిరంజీవి గారి మెగా అభిమానులు మాత్రమే ఆయన పుట్టిన రోజుకి ఒకరోజు ముందు వారం నుంచి వారోత్సవాలు చేసి, బర్త్ డే ఒక్క రోజు ముందు అనగా ఆగష్టు 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగా హీరోల సమక్షంలో మెగా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకల్ని నిర్వహిస్తారు. ఆ వేడుకలలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇండియా మొత్తం మీద ఏ హీరో అభిమానులు ఇలా చెయ్యరు.. ఇన్నేళ్ల ఇండియన్ సినీ చరిత్రలో ఆ ఘనత దక్కించుకున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి.

చిరు తర్వాత అదే రికార్డ్ ని ఇప్పుడు రామ్ చరణ్ ఖాతాలో కూడా చేరనుంది. ఈ ఏడాది నుంచీ మెగా అభిమానులు రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్ని కూడా చిరు బర్త్ డే వేడుకలానే అంగరంగ వైభవంగా జరపడానికి సిద్ధమయ్యారు. మొదటి సారి జరగనున్న మెగా అభిమానుల రామ్ చరణ్ బర్త్ డే వేడుక మార్చి 26వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచీ హైదరాబాద్ శిల్పకళావేదికలో మొదలు కానుంది. ఇప్పటికే ఆల్ ఇండియా చిరంజీవి ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రెసిడెంట్ శివ చెర్రీలు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ ని కలిసి ఈ వేడుక కోసం అధికారికంగా పర్మిషన్స్ తీసుకున్నారు.

ఈ వేడుక కోసం ఇప్పటికే మొదలైన సేవా కార్యక్రమాల గురించి రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రెసిడెంట్ శివ చెర్రీ పంచుకున్న పలు ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ మీ కోసం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ బర్త్ డే ఈవెంట్ డీటైల్స్:

1. మార్చ్ 21 నుంచి 27 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా మొక్కలు నాటడం, అన్నదానం, రక్తదానం, అనాధ పిల్లలకి నిత్యావసరాలను పంచడం, ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ మూవీ స్పెషల్ షోస్ ఇలా రోజుకో విధంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

2. లాక్ డౌన్ టైంలో చిరంజీవి గారి పిలుపుతో ఎంతో మంది ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేశారు. అన్ని రాష్టాల నుంచీ ఆ దాతలని స్పెషల్ గా తీసుకొచ్చి మెగా హీరోల చేత చరణ్ బర్త్ డే ఈవెంట్ లో సన్మానించనున్నారు.

3. లాక్ డౌన్ టైంలో ముందుండి ప్రజల కోసం తమ ప్రాణాలను అడ్డేసి నిలబడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మెడికల్ టీం, పోలీస్ డిపార్ట్మెంట్, క్లీనింగ్ టీం, ఫుడ్ సప్లై ఇలా పలు విభాగాల్లో సేవలు అందించిన వారిలో సుమారు వందమందిని సన్మానించనున్నారు.

4. ఈ వేడుకలో పలు రాష్ట్రాల నుంచి పిలిపించిన టాలెంటెడ్ పీపుల్స్ తో పలు ఎంటర్టైన్మెంట్ స్పెషల్ షోస్ ని కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ ని డిజైన్ చేసిన స్పెషల్ డాన్స్ నెంబర్ హైలైట్ అవుతుందట.

5. మెగా అభిమానులు చేస్తున్న ఈ రామ్ చరణ్ గ్రాండ్ బర్త్ డే ఈవెంట్ కి చిరు వేసిన రాచబాటలో హీరోలైన మెగా హీరోలందరూ హాజరు కానున్నారు. ఒక వేళ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల చివరి నిమిషంలో రాలేకపోయినా ఈవెంట్ జరిగే టైం లో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అభిమానులతో మాట్లాడతారు.

6. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ ‘ఆచార్య’ మరియు శంకర్ డైరెక్షన్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇండియా వైడ్ ఒక్క రామ్ చరణ్ దాదాపు 1500 కోట్ల బిజినెస్ ఉన్న సినిమాలు చేస్తున్నాడనే విషయాన్ని ఇండియన్ సినీ లవర్స్ కి చేరవేయడం కూడా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి.