చరణ్‌, శంకర్‌ల మూవీ కోసం దిల్‌రాజు కొత్తది ఓపెన్ చేశాడట

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్‌ మరియు శంకర్ ల కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో శంకర్ బిజీగా ఉన్నాడు. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో దిల్‌ రాజు ఈ సినిమాను పెద్ద ఎత్తున నిర్మించేందుకు వందల కోట్లను సమకూర్చే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సినిమా వర్క్‌ మొత్తం కూడా చెన్నై కేంద్రంగా సాగబోతుంది కనుక అక్కడ ఒక కొత్త ఆఫీస్ ను ఓపెన్‌ చేశాడని తెలుస్తోంది.

ఇంతకు ముందే చెన్నైలో దిల్ రాజు ఆఫీస్ ఉంది. కాని ఇప్పుడు పెద్దగా చరణ్‌, శంకర్‌ ల మూవీ కోసం ప్రత్యేకంగా నిర్మాణ సంస్థ కోసం ఆఫీస్‌ ను ఓపెన్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. దిల్‌ రాజు ఇప్పటికే దర్శకుడు శంకర్‌ తో క్లీయర్‌ గా ఒప్పందం చేసుకున్నాడట. వచ్చే ఏడాది వరకు ఈ సినిమాను పూర్తి చేయాలని, అంతకు మించి ఆలస్యం అయితే పారితోషికంలో కోత ఉంటుందని ఒప్పందం చేసుకున్నారట. అందుకే దర్శకుడు శంకర్‌ ఆ దిశగా హడావుడిగా సినిమాను చేసే పనిలో ఉన్నాడు అంటూ సమాచారం అందుతోంది.