ఎక్స్ క్లూజివ్: ముఖ్యమంత్రిగా మారబోతోన్న రామ్ చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్, ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆచార్యలో నక్సలైట్ పాత్రను పోషించాడు.

ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతోన్న విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. అలాగే రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.