ఆచార్య షూట్ కు రామ్ చరణ్ వచ్చేది ఎప్పుడంటే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు చరణ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొనే విషయంలో ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 11 నుండి చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అప్పటి నుండి రెండు వారాల పాటు సాగే షెడ్యూల్ లో పాల్గొంటాడు.

ఆ తర్వాత ఫిబ్రవరిలో మొదలయ్యే షెడ్యూల్ లో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తారు. ఆ షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. వీటితో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సమ్మర్ కు ఆచార్యను విడుదల చేయాలనుకుంటున్నారు.