సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమా చేస్తున్నారు అంటే అది అత్యంత భారీ కాన్వాసుతో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంచుకునే కథాంశం పాత్రలతో పాటు లొకేషన్లు అంతే గ్రాండియర్ గా ఉండాల్సిందే. కేవలం కాస్ట్యూమ్స్ విభాగం కోసమే కోట్లాది రూపాయల సొమ్ముల్ని ఖర్చు చేస్తారు. పాటల్లో కాస్ట్యూమ్స్ సెట్స్ అయితే మతులు చెదరగొడతాయి. హాలీవుడ్ తరహాలో విజువల్ గ్రాండియర్ లుక్ కోసం అతడు ఎంతమాత్రం రాజీకి రాలేరు. రజనీకాంత్.. కమల్ హాసన్.. అర్జున్ .. చియాన్ విక్రమ్ లాంటి స్టార్లను సెట్స్ కి వెళ్లకముందే రకరకాల మేకప్ లు గెటప్పులతో పరీక్షించిన శంకర్ విజువల్ వండర్స్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పైనా అదే తరహా ప్రయోగాలు చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
చరణ్ ని తన కెరీర్ బెస్ట్ లుక్ లో ఆవిష్కరించేందుకు శంకర్ చేయాల్సినదంతా చేస్తున్నారని సమాచారం. తాను తెరకెక్కిస్తున్న విజువల్ ఫీస్ట్ లో చెర్రీ లుక్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ఈనెల 8న అంటే రేపు ఈ చిత్రం భారీ ఎత్తున ప్రారంభమవుతుంది. దిల్ రాజు దాని కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రణ్ వీర్ సింగ్.. చిరంజీవి లాంటి ప్రముఖ తారలు ఓపెనింగ్ కార్యక్రమంలో సర్ ప్రైజ్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతకుముందే చరణ్ కియరాలపై ఫోటోషూట్లను పూర్తి చేసారని తెలుస్తోంది.
ఇటీవల ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ లుక్ టెస్ట్ ఫోటోషూట్ చేసారని తెలిసింది. అలాగే చరణ్ పైనే ఈరోజు ఒక ప్రత్యేక ఫోటో సెషన్ 07 సెప్టంబర్ రోజున జరిగింది. విభిన్న లుక్స్ లో ఒక క్రేజీ ఫోటో షూట్ ని చేశారని తెలిసింది. అయితే ఈరోజు కియరా అద్వాణీ కూడా ఈ ఫోటోషూట్ లో జాయినయ్యారని నేటి ఉదయమే కథనాలొచ్చాయి. కియరా పైనా లుక్ టెస్ట్ సాగిందని కూడా వెల్లడైంది. ఆసక్తికరంగా రామ్ చరణ్ ఇటీవల కొనుగోలు చేసిన తన కొత్త స్వాంకీ ఫెరారీలో ఫోటోషూట్ సెషన్స్ కి వచ్చారు.
ఇందులో నటించే బాలీవుడ్ స్టార్ ఎవరు? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది. అంజలి.. తమన్నా పాత్రలపైనా మరింతగా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దాదాపు 400కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారని కథనాలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
తెరవెనక శీనయ్య రోల్ వర్కవుటైందిలా!
శంకర్-చరణ్- దిల్ రాజ్ కాంబో మూవీ ఆర్సీ 15 ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కొని ప్రారంభమవుతోంది. అయితే ఈ సినిమా లాంచ్ వరకూ రావడానికి కారకులు ఎవరు? అంటే.. ఈ ముగ్గురిని కలపడంలో ఎన్. నరసింహరావు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ నరసింహరావు ఎవరు? అంటే శంకర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్. శంకర్ తో ఆయనకి కొన్నేళ్లగా సాన్నిహిత్యం ఉంది. ఆ కారణంగానే దిల్ రాజు ని శంకర్ వద్దకు తీసుకెళ్లి చరణ్ తోప్రాజెక్ట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించారట.
నరసింహరావుతో దిల్ రాజుకి రిలేషన్ ఎక్కడిది? అంటే.. అప్పట్లో రాజుగారు కాంపౌండ్ లో వి.వి. వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొద్ది భాగం షూటింగ్ కూడా జరిగి అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఆ సినిమా దర్శకుడే ఈ నరసింహరావు. అప్పటి నుంచి రాజుగారితో నరసింహారావుకి మంచి బాండింగ్ ఉంది. అందుకే సినిమా ఆగిపోయినా రిలేషన్ కోసం శంకర్ తో దిల్ రాజును ఆయన కలిపారు. నరసింహరావు `శరభ` అనే చిత్రాన్ని గతంలో తెరకెక్కించారు.