సిద్ధ పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చరణ్ ఈ చిత్రంలో సిద్ధగా కనిపించనున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన సిద్ధ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్ లో లాస్ట్ షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి.

ఇక సిద్ధ పాత్ర ఈ చిత్రంలో ఎలా ఉండబోతోందనే విషయంలో చరణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో తాను సెకండ్ హాఫ్ లో వస్తానని, మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఉన్న ఫీల్ కలుగుతుందని అన్నాడు. ముందు క్యామియో రోల్ గా అనుకున్నా కానీ దాన్ని కొరటాల శివ 45 నిమిషాలకు ఎక్స్టెండ్ చేసారని చెప్పాడు.

అలాగే సిద్ధ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపాడు. చిరు పాత్ర మొదలుపెట్టిన ఒక మూమెంట్ ను సిద్ధ పాత్ర ముందుకు తీసుకెళ్తుందని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.