మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలి పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` తర్వాత కెరీర్ ని ఎంత ప్లాన్డ్ గా డిజైన్ చేసుకున్నారో అతని కమిట్ మెంట్లను బట్టే అర్ధమవుతుంది. తదుపరి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా అప్పీల్ ఉండేలాగే చూసుకుంటున్నారు. `ఆర్ ఆర్ ఆర్` సెట్స్ లో ఉండగానే దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే ఆ కాంబినేషన్ లో ఆర్.సి15 ప్రారంభం అవ్వడం..కొద్ది భాగం షూటింగ్ జరగడం గురించి తెలిసిందే. అనివార్య కారణాలతో ఆర్.సీ 15 షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో `జెర్సీ` దర్శకుడు..నేషనల్ అవార్డు విన్నర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలని ముందుకు కదులుతున్నాడు.
తాజాగా `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్ లో భాగంగా చరణ్ ఎంత ప్రీ ప్లాన్ డ్ గా ఉన్నాడు అన్నది దర్శకుడు రాజమౌళి సైతం రివీల్ చేసారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చరణ్ మరో సినిమా చేయబోతున్నాడు అంటూ జక్కన్న రివీల్ చేసారు. అలాగే ఈ కాంబినేషన్ లో రాబోయే ఓపెనింగ్ సీక్వెన్సెస్ కూడా ఎలా ఉంటాయి? అన్నది తనకి తెలుసునని టాప్ సీక్రెట్ సైతం లీక్ చేసేసారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రాజమౌళి మాటల్ని బట్టి చరణ్ `ఆర్.ఆర్.ఆర్` తర్వాత ముందుగా చేయబోయే సినిమా సుకుమార్ తోనేనా? అన్న సందేహం బలపడుతోంది.
ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తోన్న `పుష్ప- పార్ట్ -2`ని మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ మూడు నెలలు గ్యాప్ తీసుకుని చరణ్ ..సుక్కు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడని బలమైన ప్రూఫ్ లభించినట్టయ్యింది. పైగా వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన `రంగస్థలం` ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. చరణ్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్. 200 కోట్ల క్లబ్ లో చేర్చిన గ్రేట్ మూవీ ఇది. అందుకే చరణ్ మరోసారి సుకుమార్ తోనే సినిమా చేస్తే పాన్ ఇండియా రేంజ్ లో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవచ్చు అన్న ధీమాతో ఉన్నారని గుస గుస వినిపిస్తుంది. పుష్ప చిత్రంతో బాలీవుడ్ లోనూ సత్తా చాటిన సుకుమార్ కి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు దక్కుతోంది. పుష్ప దర్శకుడి నుంచి రామ్ చరణ్ సినిమా అనగానే అటు హిందీ ఇటు తమిళం మలయాళంలోనూ ప్లస్ అయ్యేందుకు ఛాన్సుంటుంది. ఏ విధంగా చూసినా చరణ్ కూడా తగ్గేదేలే అని దూసుకెళుతున్నాడు