రామ్ చరణ్ జోరు.. ఎన్టీఆర్ సైలెంట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోరు చూపిస్తూ స్పీడు పెంచేస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా వుండిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ ఏటీ మేటి పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ప్రెస్టీజియస్ మూవీ ఇది.

ఈ చిత్రం కోసం దాదాపుగా మూడేళ్ల నుంచి యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి నటించిన సినిమా ఎలా వుండబోతోందా? అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనేక వాయిదాల నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` ఎట్టకేలకు మార్చి 25న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మూడేళ్ల శ్రమ అనంతరం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. దిగ్రేట్ డైరెక్టర్ శంకర్తో భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఇది 50వ చిత్రం. అంతే కాకుండా హీరో చరణ్కు దర్శకుడు శంకర్ కు 15 చిత్రం కావడంతో ఈ ముగ్గురూ ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భావించి ఖర్చుకు వెనకాడకుండా అత్యంత లావిష్గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.

బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సైలెంట్ గా మూడు షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇటీవల షూటింగ్ లో బ్రేక్ లభించడంతో ఫ్యామిలీలో కలిసి ఫిన్ లాండ్ లో చరణ్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ మూవీ ఇదే ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. ఇదిలా వుంటే `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ వెంటనే `ఆచార్య`ని కూడా లైన్ లో పెట్టేశాడు చరణ్.

తండ్రి మెగాస్టార్ తో కలిసి చేసిన ఈ మూవీ ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్`తో పాటు బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా వుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

`ఆర్ ఆర్ ఆర్` తరువాత మరో చిత్రాన్ని వెంటనే చరణ్ ప్రారంభించేసి రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం తన 30వ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.

కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంత వరకు మేకర్స్ కానీ దర్శకుడు కొరటాల శివ కానీ ఎలాంటి అప్ డేట్ ని ఇవ్వకపోవడం గమనార్హం. దంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారట.

చరణ్ `ఆర్ ఆర్ ఆర్` తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు చూపిస్తుంటే ఎన్టీఆర్ మాతమ్రం స్లో అండ్ స్టడీ అన్న ధోరణిలో సైలెంట్ అయిపోవడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ కి గురిచేస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.