క్రాక్ సినిమాపై ప్రశంసలు కురిపించిన రామ్

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా క్రాక్ కు అన్ని వైపుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రవితేజకు కంబ్యాక్ మూవీగా నిలిచింది. వరసగా నాలుగు సినిమాల ప్లాప్ తర్వాత రవితేజ నుండి హిట్ రావడంతో అతని ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నా కానీ కలెక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చూసి పాజిటివ్ గా స్పందించాడు. “క్రాక్ ను చూసి చాలా ఎంజాయ్ చేశాను. నా ఫేవరెట్ రవితేజ గారు టాప్ ఫామ్ లో ఉన్నారు. శృతి హాసన్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ల నటన సూపర్. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను సరిగ్గా నిలబెట్టింది. గోపీచంద్ మలినేని పనితీరు ప్రశంసనీయం. క్రాక్ టీమ్ కు కంగ్రాట్స్” అని రామ్ చరణ్ ట్వీట్ చేసాడు.