నాన్న పులి కథ అందరికి తెల్సిందే… ఆ కథ లో మొదట అబద్దం చెప్తే నాన్న నమ్ముతాడు.. రెండు మూడు సార్లు అబద్దం చెప్పడంతో ఆ తర్వాత నిజం చెప్పినా కూడా నమ్మడు. ఇప్పుడు అతే తరహాలో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఉంది. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రమోషన్ చేసి విడుదల చేయాలనుకున్న ‘డేంజరస్’ సినిమా కాస్త వాయిదా పడింది. సినిమా ను ఏకంగా ఆర్ ఆర్ ఆర్ తో పోల్చుతూ ప్రమోట్ చేశాడు.
ఆర్ ఆర్ ఆర్ లో ఇద్దరు హీరోల తరహాలోనే తమ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.. అని రెండు సినిమాలను నానా రకాలుగా పోల్చుతూ ప్రమోషన్ చేశాడు. తీరా సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేప్పటికి వాయిదా పడింది.
విడుదలకు క్లియరెన్స్ రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా వర్మ తెలియజేశాడు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.
ఇంత హడావుడి చేసిన రామ్ గోపాల్ వర్మ విడుదల వాయిదా డ్రామా ఆడుతున్నాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాను థియేటర్ రిలీజ్ చేసే ఉద్దేశ్యం వర్మకు అసలు లేదని.. ఆయన కేవలం ఓటీటీ వారు ఈ సినిమా కు ఎక్కువ డబ్బు పెట్టేందుకు ఈ వాయిదా డ్రామా ఆడినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ డేంజరస్ సినిమా వాయిదా డ్రామా అంటూ కొందరు బలంగా నమ్ముతున్నారు.
గతంలో ఇలాంటి ట్రిక్స్ రామ్ గోపాల్ వర్మ చాలానే వాడాడు. కనుక ఈ సినిమా విడుదల వాయిదా పడ్డట్లుగా నమ్మించి ఎక్కువ మొత్తంకు ఓటీటీకి అమ్ముకోవాలి అనేది ఆయన ప్లాన్ అయ్యి ఉంటుంది అంటూ కొందు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఆయన సన్నిహితులకు మాత్రమే తెలిసి ఉంటుంది.
వర్మ ఈసారి నిజంగానే తన సినిమా తన ప్రమేయం లేకుండా వాయిదా పడ్డా కూడా ఆయనే కావాలని వాయిదా పడేలా వివాదాలు సృష్టించి చేశాడు అంటున్నారు. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి వివాదాలు తనకు తాను సృష్టించుకోవడం వల్ల ఇప్పుడు నిజంగా ఆయన వివాదంలో ఇరుక్కున్నా కూడా ఆయన్ను జనాలు నమ్మే పరిస్థితి లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వర్మ పరిస్థితి నాన్న పులి తరహాలో అయ్యిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.