సీనియర్‌ దర్శకుడికే రామ్‌ స్క్రిప్ట్‌ సలహాలా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా ఇటీవలే వచ్చిన రెడ్‌ నిరాశ పర్చింది. దాంతో ఆయన కాస్త గ్యాప్‌ తీసుకుని తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే వీరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే లింగు స్వామితో కలిసి రామ్ స్క్రిప్ట్‌ చర్చల్లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

లింగు స్వామి చాలా సీనియర్‌ దర్శకుడు. చాలా మంచి సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించాడు. అలాంటి సీనియర్‌ దర్శకుడికి స్క్రిప్ట్‌ లో సలహాలు ఇవ్వడం అంటే ఆయన్ను అవమానించినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా లింగు స్వామి రెడీ చేసిన స్క్రిప్ట్‌ లో తన రచయితలు మరియు స్నేహితులతో కలిసి జడ్జ్‌ చేసి కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లింగు స్వామికి పెద్దగా ఆఫర్లు లేవు. దాంతో రామ్‌ చెప్పినట్లుగా వినాల్సిందే అంటున్నారు. అయినా సినిమా సక్సెస్ కోసం ఏం చెప్పినా ఏం చేసినా మంచిదే కదా అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.