తెలుగు హీరోయిన్స్ లో గుర్తుండి పోయే ముద్దుగుమ్మ రంభ. 1990ల్లో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కూడా ఈమె నటించింది. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్న రంభ అంటే ఇప్పటికి చాలా మందికి ఇష్టం. ఇప్పుడు రంభ సినిమాల్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నారు. అలాంటి రంభపై ఒక పాటను మహా సముద్రంలో చూపించబోతున్నట్లుగా దర్శకుడు అజయ్ భూపతి ప్రకటించాడు.
ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో ఆయన రంభ కు వీరాభిమానిగా కనిపించబోతున్నాడట. వైజాగ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్టింగ్ లో జగపతిబాబు మరియు శర్వానంద్ లపై రంభ సాంగ్ ను చిత్రీకరించారని తెలుస్తోంది. రంభ గౌరవార్థం ఈ పాట ఉంటుందని దర్శకుడు అంటున్నారు. రంభ నుండి ముందే ఈ పాటకు గాను అనుమతులు తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ పాటపై ఆమె పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు. మరి ఈ సినిమాలో రంభ యొక్క పాత్ర ఏంటీ అనేది చూడాలి.