మంత్రి రాసలీలల సీడీలో ఉన్న మహిళ ఎక్కడ?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహోళి రాసలీలల వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జార్కిహోళి విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ పేర్కొన్నాడు. మరో వైపు జార్కిహోళి రాసలీలల సీడీలో ఉన్న మహిళ కోసం అన్వేషిస్తున్నారు. ఆమె అండర్ గ్రౌండ్‌ లో ఉన్న నేపథ్యంలో విచారణ పూర్తిగా నిలిచి పోయినట్లుగా అయ్యింది. ఆయన విషయమై ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఆగ్రహం తో ఉంది.

రమేష్‌ జార్కిహోళికి ఆ మహిళకు కొన్నాళ్లుగా అక్రమ సంబంధం ఉందట. కాని ఈమద్య కాలంలో ఆమెను ఒక ఎమ్మెల్యే వర్గం లోబర్చుకుని సీడీ రాసలీలలు విడుదల చేసినట్లుగా రమేష్ వర్గం వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ను పోలీసులు కనిపెడితే తప్ప ఈ కేసు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. ఏం జరుగబోతుందో చూడాలి.