#లైగర్.. రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్ ఏమై ఉంటుందో?

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. మెజార్టీ పార్ట్ చిత్రీకరణ అంతా ముంబైలో ప్రత్యేకంగా సెట్లు నిర్మించి పూర్తి చేసారు. కథ నేపథ్యం ఎక్కువగా ముంబైలోనే సాగుతుంది కాబట్టి అక్కడి లోకేషన్స్ నే ఎంపిక చేసుకున్నారు. హైదరాబాద్ లో చాలా తక్కువ భాగమే షూటింగ్ జరిగింది. ఇక సెకెండ్ వేవ్ పీక్స్ కు చేరుకున్న సమయంలో యూనిట్ షూటింగ్ నిలిపివేసారు. అప్పటి నుంచి ఇప్పటిరకూ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. కొన్ని రోజుల క్రితం పూరి డ్రగ్స్ కేసు లో ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

చివరిగా ఈడీ విచారణ పూర్తయింది. దీంతో పూరి కి టైమ్ దొరికింది. ఈ నేపథ్యంలో లైగర్ షూట్ ని తిరిగి ప్రారంభిస్తున్నారు. గోవా బీచ్ లో ప్రత్యేకంగా సెట్లు నిర్మించి అందులో చిత్రీకరణ జరపనున్నారు. ఈ షెడ్యూల్లో నైట్ మోడ్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ సెట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పూరి సినిమా అంటే బీచ్ తప్పని సరి. దేశంలో ఏదో ఒక బీచ్ ఒడ్డున కొన్ని సన్నివేశాలు తప్పక షూట్ చేయాల్సిందే. ఎక్కువగా గోవా..బ్యాంకాక్ బీచ్ లను ఎంపిక చేసుకుంటున్నారు. అరుదుగా చెన్నై…వైజాగ్ బీచ్ ల్లోనూ షూటింగ్ చేస్తుంటారు.

ఎక్కువగా ఇండియాలో గోవాలో అనుమతులు సులభంగా దొరుకుతాయి. నిబంధనలు పెద్దగా ఉండవు కాబట్టి ఎక్కువగా గోవాకే ప్రాధాన్యత ఇస్తారు. సినిమాకి సంబంధించిన మరింత అప్ డేట్ బుధవారం వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ పుట్టిన రోజు. లైగర్ లో సీనియర్ నటి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్రక సంబంధించిన అప్ డేట్ తో పాటు..ఇతర విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్యా పాండే నటిస్తోంది. కరణ్ జోహార్-పూరి-చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ కానుంది.

వరుణ్ ధావన్ ని పరిచయం చేసినంతగా..!

టాలీవుడ్ లో కెరీర్ పరంగా ఎదురే లేని లైనప్ తో దూసుకెళుతున్నాడు విజయ్ దేవరకొండ. యువహీరోల్లో నిస్సందేహంగా అసాధారణ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరో అతడు. విజయ్ దూసుకెళ్లే తత్వం.. ఫ్యాషనిస్టాగా వైవిధ్యం .. అతడి కథల ఎంపికలు ప్రతిదీ తనపై ప్రజల్లో ఆకర్షణను పెంచాయి. హీరోగా ఎదిగినా అతడు ఒదిగి ఉండే తత్వంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అవుతున్నా అతడు కించిత్ గర్వాన్ని కూడా చూపించడు. అందుకే ఇప్పుడు ఇంతింతై ఎదిగేస్తున్నాడు.

లైగర్ చిత్రంతో అతడి రేంజు మారనుంది. ఈ సినిమాని హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కరణ్ జోహార్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. ఎంతగా అంటే రజనీకాంత్ సినిమాని మించి ప్రభాస్ తర్వాత విజయ్ అనేంతగా అతడిని ప్రమోట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. విజయ్ ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వరుణ్ ధావన్ ని పరిచయం చేసినంత వైబ్రేంట్ గా పరిచయం చేయాలని కరణ్ భావిస్తున్నారని లైగర్ విడుదల అత్యంత భారీగా ఉంటుందని కథనాలొస్తున్నాయి.