బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ .. టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ ఓ మృగం.. ఓ పరిపూర్ణమైన యంత్రం అంటూ రణ్ వీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. `బాహుబలి` తరువాత టాలీవుడ్ స్టార్స్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` ప్రయోషన్స్ తో ఆ క్రేజ్ మరీ తారా స్థాయికి చేరిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్ లు కూడా మన వాళ్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
అందరిలాగే రణ్ వీర్ సింగ్ కూడా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా రణ్ వీర్ సింగ్ అభిమానులతో చిట్ చాట్ ని నిర్వహించారు. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.
అయితే రామ్ చరణ్ గురించి అడిగిన ప్రశ్నకు రణ్ వీర్ సింగ్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో రామ్ చరణ్ క్రేజ్ బాలీవుడ్ లోనూ పతాక స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రణ్ వీర్ సింగ్ ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల్లో తనకు అత్యంత ఫేవరేట్ యాక్టర్ ఎవరంటే రామ్ చరణ్ అని చెప్పేశారు. అంతే కాకుండా చరణ్ గురించి చెప్పమంటే `అతనొక మృగం.. ఓ పరిపూర్ణమైన మిషీన్` అంటూ షాకిచ్చాడు. `మగధీర` చూపినప్పటి నుంచే చరణ్ ని అభిమానిస్తున్నానని `ఆర్ ఆర్ ఆర్` కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానన్నారు.
ఈ తరువాత నెట్టింట వైరల్ గా మారిన `నాటు నాటు …` సాంగ్ ని పాడిన రణ్ వీర్ .. చరణ్ అభిమానుల్ని ఫిదా చేయడం విశేషం. రణ్ వీర్ అన్న మాటలు రామ్ చరణ్ అభిమానుల్ని సంబరాల్లో మునిగితేలేలా చేశాయి. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ముందే రణ్ వీర్ ఈ రేంజ్ లో చరణ్ ని పొగిడేస్తుంటే రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేస్తాడో అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా వుంటే రామ్ చరణ్ వ్యక్తిగత బిజినెస్ నిమిత్తం భార్య ఉపాసనతో కలి ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ముంబై ఏయిర్ పోర్ట్ లో ఫొటో గ్రాఫర్ లకు చిక్కారు కూడా. `ఆర్ ఆర్ ఆర్` తరువాత రామ్ చరణ్ ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాతే చరణ్ .. `జర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి మూవీని స్టార్ట్ చేస్తారని తెలిసింది.