రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ, కన్నడం లో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు అయిదు పెద్ద సినిమాలు ఉన్నాయి. దాంతో షూటింగ్ లకు బ్రేక్ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఆమె నటించిన ‘పొగరు’ సినిమా రేపు విడుదల కాబోతున్న కూడా కనీసం ప్రచారం చేయలేక పోతుంది. పొగరు సినిమాలో యాక్షన్ స్టార్ అర్జున్ మేనల్లుడు ధృవ హీరోగా నటించాడు. కన్నడంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
పొగరు సినిమా షూటింగ్ లో రష్మిక పాల్గొనక పోవడంపై పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ధృవ చిత్ర యూనిట్ సభ్యులతో ఆమెకు విభేదాలు ఉన్నాయని అందుకే ఆమె విడుదలకు ఆసక్తి చూపడం లేదని, ప్రచారంలో ఆమె పాల్గొనేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక స్పందిస్తూ షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్లే తాను పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చింది. పుష్ప సినిమాతో పాటు హిందీలో కూడా ఒక సినిమాను ఈమె చేస్తున్నది. గ్యాప్ లేకుండా ఈ రెండు సినిమాల్లో నటిస్తుంది. అందుకే పొగరు పబ్లిసిటీ కార్యక్రమాల్లో ఈమె కనిపించడం లేదు.