ప్రస్తుతం ప్రభాస్ అంటే ఓ తెలుగు హీరోనో లేదా సౌత్ లో స్టార్ హీరోనే కాదు. బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ప్రభాస్ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ వస్తున్నాయి. సినిమా సినిమాకు అభిమానులు పెంచుకుంటూ వస్తున్న ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.
షూటింగ్ లు లేకపోవడంతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటున్న రష్మిక మందన్నా తాజాగా లైవ్ లో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. రష్మిక మందన్నా మాట్లాడుతూ డేట్ కు వెళ్లే అవకాశం వస్తే నేను ప్రభాస్ తో వెళ్తానంది. ఆయన ఒప్పుకోవాలే కాని నేను రెడీ అంది. తనకు ఇష్టమైన హీరోల్లో ప్రభాస్ ఒకరు అంటూ ఆయనపై అభిమానంను వ్యక్తం చేసింది. ప్రభాస్ తో సినిమా కోసం ఇలాంటి వ్యాఖ్యలను ఈ అమ్మడు చేసిందనే కామెంట్స్ ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.