ఎవరు అలా రాకండీ ప్లీజ్‌ : రష్మిక

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక అడ్రస్ వెదుక్కుంటూ తెలుగు వ్యక్తి ఒకరు ఏకంగా కర్ణాటక వెళ్లాడు. దాదాపుగా 900 కిలో మీటర్లు ప్రయాణించిన ఆ వ్యక్తి రష్మిక అడ్రస్ లభించక పోవడంతో అక్కడ తిరుగుతూ స్థానికులకు అనుమానం కలిగేలా చేశాడు. దాంతో పోలీసులు అతడిని తీసుకు వెళ్లి విచారించగా అసలు విషయం చెప్పాడు. రష్మికను చూసేందుకు వచ్చానంటూ అతడు చెప్పడంతో కౌన్సిలింగ్‌ ఇచ్చి అతడిని తిరిగి పంపించారు. విషయం తెలిసిన రష్మిక షాక్ అయ్యానంటూ ట్విట్టర్‌ లో పేర్కొంది.

ఈ సమయంలో ఇలాంటి పనులు అస్సలు చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఏదో ఒక రోజు తప్పకుండా మనం కలుద్దాం. అప్పటి వరకు వెయిట్‌ చేయండి. ఇలా చేయడం నాకు నచ్చదు. ఎవరు కూడా ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. రష్మిక చేస్తున్న వరుస సినిమాలు సక్సెస్ అవుతూ ఉండటంతో ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సమయంలో ఇలాంటి సాహస యాత్రలు కామన్‌ గా జరుగుతూ ఉంటాయని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ కరోనా పోయాక అభిమానుల మీటింగ్‌ ను రష్మిక ఏర్పాటు చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.