ఖిలాడీలో మాస్ మహారాజా మొదటి లిప్ లాక్

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఆనందంలో తేలిపోతున్నాడు. వరస ప్లాపుల తర్వాత రవితేజకు మంచి విజయం దక్కింది. క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ రూల్ ఉన్నా కానీ, సంక్రాంతికి భారీ పోటీ ఉన్నా కానీ క్రాక్ కు కలెక్షన్స్ వెల్లువ ఆగట్లేదు. సోమవారం కూడా క్రాక్ మంచి నంబర్స్ ను నమోదు చేయగలిగింది.

ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడీగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో ఒక ఇంటిమేట్ సీన్ లో నటించాడట. మీనాక్షి చౌదరితో లిప్ లాక్ సన్నివేశాన్ని ఇటీవలే వైజాగ్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ సీన్స్ లో నటించినా కానీ రవితేజ ఇన్నాళ్లూ లిప్ లాక్ కు దూరంగానే ఉంటూ వచ్చాడు. మొత్తానికి ఈ సినిమాతో రవితేజ ఆ రూల్ ను బ్రేక్ చేసాడు.