సర్కారు వారి పాటలో మళ్లీ రేణుదేశాయ్‌ వార్తలు

మహేష్‌ బాబు సర్కారు వారి పాట త్వరలో పట్టాలెక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్‌ బాబుకు సోదరి పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి వార్తుల వస్తున్నాయి. అయితే ఈసారి సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌ బాబు కు వదిన పాత్రలో రేణు దేశాయ్‌ కనిపించబోతుంది అంటున్నారు. కొన్నాళ్ల క్రితం మహేష్‌ బాబుతో పాటు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. సినిమాలోని కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. మహేష్‌ తన గత సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతిని తీసుకు వచ్చాడు. ఇప్పుడు రేణు దేశాయ్‌ ని ఈ సినిమాతో తీసుకు రాబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రేణు దేశాయ్‌ ఒక వెబ్‌ సిరీస్ ను చేస్తున్న విషయం తెల్సిందే.