పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ కి మంచి గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఆమె చేసిన వ్యాఖ్యలు మరియు కొన్ని సార్లు ఆమె చేసే పోస్ట్ లు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే వినాయక విగ్రహంను ప్రతిష్టించిన ఫొటోను పోస్ట్ చేసి దేవాలయాల గురించి దేవుళ్ల గురించి వ్యాఖ్యలు చేసింది.
దేవుడు ఏమైనా మనతో తనను బంగారం వజ్రాలతో అలంకరించమని అన్నాడా లేదు కదా ఎందుకు మనం అలా చేస్తున్నాం. దేవాలయాలను అద్బుతంగా కట్టమని అడిగాడా లేదు కదా ఎందుకు జనాలు ఇలా చేస్తున్నారో నాకు తెలియడం లేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుంటే మరి కొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉన్నారు.