రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్


ప్రముఖ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుడా ఉండే ఆమె ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది. అయితే తాజాగా రేణు దేశాయ్ ఈ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక షాకింగ్ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా పోస్ట్ చేశారు. దీంతో సదురు బ్యాంక్ ఖాతాదారులతో ఇతరులు కూడా షాక్ అయ్యారు.

రేణుదేశాయ్ షాక్ అవ్వడానికి అసలు కారణాలు చూస్తే.. ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్ మొబైల్ యాప్ లోకి లాగిన్ అయినప్పుడు అది వేరొకరికి ఖాతాలోకి లాగిన్ అయ్యింది. అంతేకాదు.. సదురు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూపించింది. దీంతో తాను షాక్ అయ్యానని రేణుదేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆ వివరాలను షేర్ చేశారు. హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసినా వారు సీరియస్ గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఆ ఖాతా నుంచి లాగ్ ఔట్ అయ్యానని వివరించారు. కస్టమర్లకు బ్యాంకు ఇస్తున్న భద్రతపై రేణు ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఆ బ్యాంకులోని తన అకౌంట్ ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు.

రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ అయ్యింది. సదురు బ్యాంకు లావాదేవీలు భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.