మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయే స్వయంగా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. తాను ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైతే టెస్టులు చేయించుకోవాలని రేవంత్ సూచించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు 25వేలకు పైగా కేసులు నమోదు కావడం భయబ్రాంతులకు గురి చేస్తోంది. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న తెలంగాణలో కూడా కరోనా వ్యాపిస్తోంది.